పవన్ కు సెల్ టెన్షన్ ! జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ కి ముచ్చెమటలు పట్టించిన పవన్ కళ్యాణ్ కు సెల్ టెన్షన్ మొదలు అయ్యింది అంటే ఎవ్వరూ నమ్మరు. పవన్ తో పాటు పవన్ చుట్టు పక్కలవారికి కూడ ఈ సెల్ టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ అని అంటున్నారు. అనేక వాయిదాల తరువాత పవన్ తన కృష్ణుడి గెటప్ తో మొన్న సోమవారం నుండి నానకరాంగూడలోని రామానాయుడు స్టూడియోలో గోపాలుడి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ లుక్ బయటకు రాకుండా నిర్మాతలు గట్టి ఏర్పాట్లు చేసి యూనిట్ సభ్యులు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించారు. అంతేకాకుండా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని అతి జాగ్రత్తగా చెక్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక పక్కా ప్రణాళికతో పవన్ ‘గోపాలు’ డి ఫస్ట్ లుక్ విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో పవన్ ‘అత్తారింటికి దారేది’
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more