“గోపాలా గోపాలా” సెట్స్ లో పవన్ హల్చల్ వెంకటేష్, పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రధారులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం “గోపాలా గోపాలా”. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఓహ్ మై గాడ్” చిత్రానికిది రీమేక్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అయ్యాడని సమాచారం. హిందీలో అక్షయ్ కుమార్ నటించిన ఈ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన కళ్యాణ్ ఈ తెలుగు రీమేక్ లో 25 నిమిషాలు కనిపిస్తాడని తెలుస్తోంది.
Latest Movie News, Movie Trailers & Upcoming Movies, Actress Gallery, popular tv shows,cinema News, Movie gossips, Tollywood movie latest news and many more