Skip to main content

Posts

Showing posts with the label సమంత

సమంత, తమన్నా మసాలా సీన్లు....పెద్దలకు మాత్రమే!

హైదరాబాద్: సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టెనర్ ‘అల్లుడు శ్రీను'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జులై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈచిత్రాన్ని పెద్దలకు మాత్రమే అని సర్టిఫైడ్ చేసారు. 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమాలో హీరోయిన్ సమంత, తమన్నాలపై మసాలా సీన్లు, యాక్షన్ సన్నివేశాలు మొతాదుకు మించి ఉండటంతో పెద్దలకు మాత్రమే పరిమితం అని సర్టిఫైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోది.  సమంత, తమన్నా మసాలా సీన్లు....పెద్దలకు మాత్రమే!