Skip to main content

Posts

Showing posts with the label Success Meet
అభిమానుల కోసం టాప్‌ ఎక్కిన బన్నీ.. వైజాగ్‌ : స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కు వైజాగ్‌లో ఘనస్వాగతం లభించింది. తన తాజా చిత్రం అల.. వైకుంఠపురములో... సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం చిత్రబృందంతో కలిసి బన్నీ ఆదివారం వైజాగ్‌కు వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆర్కే బీచ్‌లో ఆ ఈవెంట్‌ జరగనుంది. ఇందు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే వైజాగ్‌ చేరుకున్న బన్నీకి అభిమానలు ఘనస్వాగతం పలికారు. అలాగే భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా తరలివచ్చిన అభిమానుల కోసం బన్నీ కారుపైకి ఎక్కారు. తనకోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు. అల్లు అర్జున్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే, మ్యూజిక్‌ డైరక్టర్‌ థమన్‌ కూడా సక్సెస్‌ ఈవెంట్‌ కోసం ఇప్పటికే వైజాగ్‌ చేరుకున్నారు. కాగా, జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో చిత్ర బృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కు ప్లాన్‌ చేసింది. ఇంద...