సూర్యను ఇబ్బందిపెడుతున్న జ్యోతిక..! |
|
కోలీవుడ్
టాప్ హీరో సూర్యకు అతడి భార్య సమస్యగా మారింది అన్న వార్తలు కోలీవుడ్
మీడియాలో వస్తున్నాయి. సూర్యని పెళ్ళి చేసుకున్న తరువాత నటనకు దూరమైన
జ్యోతిక గత కొన్ని సంవత్సరాలుగా నటనకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే
నటించాలి అన్న ఆమె కోరిక మళ్ళీ ఆమెను సినిమా సెట్స్ పైకి తీసుకు వస్తోంది.
ప్రస్తుతం జ్యోతిక మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ అనే సినిమా
తమిళ రీమేక్ లో నటిస్తోంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయబోతున్నారు. ఈ
సినిమాను జ్యోతిక భర్త సూర్య నిర్మిస్తున్నాడు. అయితే అసలు విషయం ఏమిటంటే
గతంలో టాప్ హీరోయిన్ గా జ్యోతిక ఒక వెలుగు వెలిగిన రోజులలో కూడా జ్యోతికకు
ప్రతీ సన్నివేశానికి సంబంధించిన డైలాగ్ కు కనీసం 4 లేక 5 టేకులు తీసుకోవడం
అలవాటు అట. ఇదే అలవాటుతో ఇప్పుడు భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ సినిమా
విషయంలో కూడా జ్యోతిక ఇలా నాలుగైదు టేకులు తినేస్తే షూటింగ్ సమయం వృథా
కావడమే కాకుండా మిగతా కో ఆర్టిస్టుల డేట్స్ తో ఇబ్బంది ఏర్పడి ఈ సినిమా
పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా ఈ సినిమా బడ్జెట్ ను
పెంచేస్తుందని సూర్య టెన్షన్ అని టాక్. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ లోని
జ్యోతిక పాత్రకు సంబంధించిన డైలాగ్స్ బాగా చదివి షూటింగ్ స్పాట్ కు
వెళ్ళమని సూర్య జ్యోతికకు గట్టిగా చెప్పాడు అని కోలీవుడ్ మీడియా వార్తలు
రాస్తోంది..
Comments
Post a Comment