Skip to main content

నన్ను ఈటీవీ (ETV) నుంచి తొలగించిన చానెల్ పెద్దలకో ప్రశ్న

"నన్ను ఈటీవీ (ETV) నుంచి తొలగించిన చానెల్ పెద్దలకో ప్రశ్న"


నా భర్త తెలంగాణవాదమే నన్ను తొలగించడానికి అసలు కారణమని చెప్పడానికి మీకు ఎందుకు ధైర్యం చాలడం లేదు? ఏవొ సొల్లు కారణాలు (అబధ్ధాలు) చూపించి నన్ను షూటింగులకు రావొద్దని చెప్పాల్సిన స్థాయికి ఎందుకు దిగజారారు?
గత 14 ఏళ్లుగా (నవంబర్ 2000) ఫ్రీలాన్స్
యాంకరింగ్ చేస్తున్నాను. ఇతర చానెల్స్ లో ఎన్ని ప్రొగ్రాంలు చేసినా ఈటీవీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. ఇది నా మాతౄ సంస్థ అనే భ్రమలో ఉండిపొయాను. నెలకు 30 ఎపిసొడ్ల నుంచి 15కి తగ్గించినప్పుడు, నా రెమ్యునరేషన్లో సగానికి సగం కోత పెట్టినప్పుడు, ఎందుకిలా చేసారు అని అడగడమే తప్ప, సంస్థ నుంచి వెళ్లిపోవాలని ఆలోచించలేదు. నేను చేస్తున్న "సఖి" లాంటి ప్రొగ్రాం తమ చానెల్లొ చేయాలని వేరే వాళ్లు అడిగితే, అది నైతికంగా కరెక్టు కాదని చెప్పి తిరస్కరించాను. బహుషా అదే నేను చేసిన పొరపాటు కావచ్చు. ఈటీవీ వదిలేసి వెళ్లి, యాంకరింగ్ టాలెంటు గతిలేక తిరిగి వచ్చిన వాళ్లను అందలం ఎక్కించినప్పుడే మీ ప్రాంతీయ దురభిమానం పసిగట్టాల్సింది. ఈ విషయం నా జీవిత భాగస్వామి నాకు చెప్పినా నేను నమ్మలేదు.

ఫ్రీలాన్స్ యాంకరింగ్ లో ఉన్నాసరే ఉద్యోగికంటే స్థిరంగా ఒక చోట నిలకడగా పని చేయాలని నమ్మాను. ఆ చేసేదేదో ఈటీవీలో కాకుండా ఇంకేదైనా చానెల్లొ చేయాలని నా భర్త చెప్తే తేలికగా తీసుకున్నాను. ఈటీవీలో ఏదొ ఒకరోజు నన్ను తెలంగాణ కోనం లొంచి చూస్తారని హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయాన చెప్పిందే నిజమైంది.

నాకు ఫోన్ చేసి " సుమలతగారు మీరు రేపటి నుంచి మీరు షూటింగుకి రావొద్దని మీతొ చెప్పమన్నారు" అని ఒక ఈటీవీ అస్సిస్టెంటు చెప్పాడే తప్ప, నిర్ణయం ఎవరు తీసుకున్నారో సూటిగా చెప్పలేదు. నాలాంటి ఒక చిన్న వ్యక్తిని తొలగించడానికి ఈటీవీ పెద్దలు మొహం దాచుకొవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకిలా చేసారని ముగ్గురు పెద్దవాళ్లను అడిగితే "అబ్బే నాకు ఈ విషయం గురించి మీరు చెప్తేనే తెలిసిందని" బొంకడమెందుకు.

నా జీవిత భాగస్వామి గతంలో నాలుగేళ్ల పాటు జర్నలిస్టుగా ఆ చానెల్లో పని చేసి నరకం అనుభవించాడు. ప్రాంతీయ దురభిమానం ఉన్న కొందరు వెధవలు ఆయన్ని పెట్టిన హింస భరించలేక నా దగ్గర బాధ పడ్డ సందర్భాలు నాకింకా గుర్తు. ఏదో ఒకరిద్దరు వెధవలు ఆయన్ని ఇబ్బంది పెట్టారు తప్ప, దాని ప్రభావం నా మీద పడదనుకున్నాను. ఆయన ఫెస్బుక్ లో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తాడని తెలుసు. ముఖ్యంగా తెలంగాణ వ్యతిరేక మీడియాను అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తాడని తెలుసు. కాని నేను ఏనాడూ న్యూస్ డిపార్ట్మెంటులో పనిచెయలేదు. నాకు జర్నలిజం గురించి పెద్దగా తెలియదు. ఎంతసేపు ఫీచర్స్, ఎంటర్టైన్మెంట్ అనే ప్రొగ్రామింగ్ ప్రపంచంలో ఉండేదాన్ని. అలాంటిది "సుమలత భర్త ఫెస్బుక్ లో మరీ ఎక్కువగా తెలంగాణ పొస్టులు, కామెంట్లు పెడుతున్నాడని" మీరు మీటింగులో చర్చించుకొని, "ఆ అమ్మాయిని ఇక రావొద్దని చెప్పండి" అని నిర్ణయం తీసుకొవడం మీకే చెల్లింది. ఈ విషయం నాకెలా తెలిసిందని పెద్దగా ఆలోచించొద్దు. 14 ఏళ్లుగా సంపాదించుకున్న నా శ్రేయొభిలాషులు, ఈటీవీలో ఇంకా పని చేస్తున్న నా జీవిత భాగస్వామి స్నేహితులు చెప్పారు. "నా భర్త తెలంగాణ వాదమే" నన్ను తొలగించడానికి కారణమని ఒకటికి పదిసార్లు నిర్ధారించుకున్నాకే నమ్మాల్సి వచ్చింది.

కాని ఈటీవీ నుంచి నన్ను తొలగించడానికి నాకు చెప్పిన సొల్లు కారణం "చానెల్లో కొత్తనీరు రావాలని, ప్రొగ్రామింగ్ మార్చాలని, కొత్త యాంకర్లను నియమించాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు" అని. నాకంటే పదేళ్లు ఎక్కువ వయసున్న ముసలి యాంకర్లు మీకు కొత్తగా ఎందుకు కనిపిస్తున్నరో వాళ్ల ఊరు, ప్రాంతం చూస్తేనే తెలుస్తుంది. చివరగా రెండు విషయాలు. ఒకటి... మా ఆయాన ఆ బ్రహ్మదేవుడు చెప్పినా తెలంగాణవాదాన్ని వదలడు. రెండు... నాకు ఇంకే చానెల్లో అవకాశం రాకపోవచ్చుగాని, పని చేసేవారిని మోసం చేయడం మాని, నిజాలు మాట్లాడడం నేర్చుకొండి.


Comments

Popular posts from this blog

priyamani hot and sexy photos , Priyamani wallpapers

 Priyamani hot and sexy photos  Priyamani Images

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా !

జూనియర్ కొడుకు కలియుగ కృష్ణుడా ! నిన్న ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కు వారసుడుగా పుట్టిన బుడ్డోడు పుట్టి ఒకరోజు కూడ కాకుండానే మీడియా వార్తలకు ఎక్కాడు. దీనికి కారణం ఈ బుడ్డోడు శ్రీకృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టడం. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇతరులను ఆకర్షిస్తూ అందంగా ఉంటూ ఆజానుబాహుడై అందమైన కళ్ళు,

Kajal Agarwal Family And Childhood Photos,unseen Pictures, Wallpapers

Kajal Agarwal Childhood Photo When she Was 6 Years Old