ఫేస్‌బుక్ పుణ్యమా అని విడాకులు!
ఫేస్‌బుక్ కారణంగా స్నేహాలు, అనుబంధాలు పెరగడమే కాదు.. ఉన్న అనుబంధాలు కూడా తెగిపోయే అవకాశాలున్నాయి. ఈ పాయింట్‌కి బలం చేకూర్చే సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా బోలెడన్ని వున్నాయి. పచ్చగా వున్న కాపురాలు సైతం ఫేస్ బుక్ పుణ్యమా అని కూలిపోయిన సందర్భాలకి అయితే లెక్కే లేదు. ఈమధ్యకాలంలో ఫేస్ బుక్ కారణంగా పెటాకులైపోయిన పెళ్ళిళ్ళ సంఖ్య చాలా వుందని ఒక అధ్యయనం చెబుతోంది. ఫేస్ బుక్ కారణంగా దాంపత్య సంబంధాలకు ముప్పు వాటిల్లుతోందని ఓ అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. ఫేస్‌బుక్ వల్ల అమెరికాలోనే ఇలాంటి పెటాకుల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అమెరికాలో ప్రతి ఏటా జరిగే విడాకుల శాతం మరో నాలుగు శాతం పెరిగిందట. ఆ నాలుగు శాతం పెరగడానికి ఫేస్‌బుక్కే కారణమట.
Comments
Post a Comment